![]() |
![]() |

స్టార్ మా టీవిలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -279 లో....కార్తీక్ దగ్గరికి దీప వస్తుంది. తనని చూడడానికి కూడా కార్తీక్ ఇష్టపడడు. ఈ వారం రోజుల్లో మనకి సాయం చేసిన మనిషి గురించి ఎవరు ఎవరు అంటూ డిస్కషన్ చేసుకున్నాం.. ఒక్కసారి కూడా నీకు చెప్పాలి అనిపించలేదా అని కార్తీక్ అంటాడు. కావేరి గారు ఎవరికి చెప్పొద్దని మాట తీసుకున్నారని దీప అనగానే.. ఇప్పుడు నేను అందరి ముందు మాట పడాల్సి వచ్చింది. నన్ను ఇంట్లో నుండి గెంటేసారు. ఇప్పుడు నేనే నీ కూతురికి సాయం చేసానని చెప్తున్నాడంటూ కార్తీక్ బాధపడుతాడు. అప్పుడే కాంచన వస్తుంది. కావేరి గారు నాకు సాయం చేసిన విషయం మొదట నాక్కూడా తెలియదంటూ దీప జరిగింది మొత్తం చెప్తుంది.
అందరి కంటే ఎక్కువగా మీ గొప్పతనం ఆవిడకే తెలుసని దీప అంటుంది. దీప చెప్పింది విన్నాం కదా.. అందులో తన తప్పు కూడా ఏం లేదని కాంచన అంటుంది. మరొకవైపు మమ్మీ డాడ్ ఎక్కడికి వెళ్లారంటూ పారిజాతాన్ని జ్యోత్స్న అడుగుతుంది. గుడికి అనుకుంటా అని పారిజాతం అనగానే.. అప్పుడే సుమిత్ర, దశరథ్ లు వస్తారు. ఎక్కడికి వెళ్లారని జ్యోత్స్న అడుగుతుంది. నీకు చెప్పాలిసిన అవసరం లేదంటూ సుమిత్ర వెళ్ళిపోతుంది. దశరథ్ కూడా ఏదో కౌంటర్ ఇచ్చి వెళ్లిపోతాడు. చూసావా తాతయ్య వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారు.. వాళ్ళు కచ్చితంగా దీప చేస్తున్న పూజ దగ్గరికి వెళ్లారని జ్యోత్స్న అనగానే.. నాకు ఇంకా అర్థం కాలేదు అనుకున్నావా అని శివన్నారాయణ అంటాడు. మరేం అనడం లేదని జ్యోత్స్న అనగానే.. చెప్తే వినని వాళ్ళతో ఏం అనగలం అని వెళ్లిపోతాడు.
అదేంటి అందరు ఇలా మారిపోతున్నారని జ్యోత్స్న పారిజాతంలు టెన్షన్ పడతారు. కాంచన , దీప లు కావేరి ఇంటికి వస్తారు. లోపలికి రావచ్చా అని కాంచన అనగానే.. వద్దని శ్రీధర్ అంటాడు. మీరు రండి అంటూ కావేరి లోపలికి పిలుస్తుంది. నువ్వు నా మనవరాలిని కాపాడవంటూ కావేరి చేతులు పట్టుకొని కాంచన మాట్లాడుతుంటే.. కావేరి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |